
తెలుగు సినిమాలు చూసే వారికి వంశీగారిని పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆయన సినిమాల వలే అయన కథలు కూడా పాఠకులకు ద్రుశ్యకావ్యాలు.
వంశీగారు గోదావరిని,పసలపూడిని ఎంత ప్రేమించారో ఈ పుస్తకంలో ప్రతి అక్షరం చెపుతుంది. ఆర్థం కాని వారికి బాపు గారి రంగుల బొమ్మలు కనువిందు చేసి చెబుతాయి.
నన్ను అడిగితే ఏ తెలుగు కథ అయినా ఎంత మంచిదో,ఎంతగా పాఠకుల మనస్సుకి దగ్గరగా వుంటుందో తెల్యాలంటే బాపు గారికి వొకసారి చదివి బొమ్మ వేయమంటే చాలు. కధ మంచిదయితే బొమ్మతో అందం పెరుగుతుంది. కథ సరిగా లేకపొతే బొమ్మే చెపుతుంది రచయిత ఇలా చెపుదామని అనుకొని చెప్పలేకపోయాడు అని. వంశీగారు ప్రతి కథలోను బాపుగారి బొమ్మలతో కథ అందం పెంచారు.
అమరావతి కథలు తర తరాల కథలతో మనని ఎన్నో పాత్రల దగ్గరికి తీసుకొని వెళితే - వంశీగారు ప్రతి కథలోను తన చుట్టూ వున్న వారి లేక కొంచెం మన ముందు తరం వారి గురించి చెప్పారు.
అమరావతి కథా రచయిత తన గురించి చివరి కథలో చెపితే, వంశీగారు ప్రతి కథలోను ప్రతి పదం లోను గోదావరి ప్రజల అలవాట్లు,ప్రేమలు, స్నేహాలు, అమాయకత్వం కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగారు.
ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. వెబ్లో కొనాలంటే/ కావాలంటే
- avkf.org/BookLink/display_titled_book.php?book_id=9423PHPSESSID=8be33dae93c1e8b498af4d62866b35fb
ఇంతవరకూ చదవక పొతే, తప్పక కొనండి - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.
baagaa cheppaarandi,chaalaa baagaa raasaadu.
ReplyDeleteNice intro..
ReplyDeleteవంశీ కథల్లో ప్రకృతి వర్ణనలని ప్రత్యేకంగా చెప్పాలి.. మనం ఆ కథ జరుగుతున్నా ప్రదేశం లో ఉన్న అనుభూతిని ఇస్తాయవి.. అలాగే కథ తాలూకు మూడ్ ని క్రియేట్ చేస్తాయి కూడా.. మీరు కొంచం వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తే వ్యాఖ్యలు రాసేవాళ్ళకి సులువుగా ఉంటుందండీ..
ReplyDelete