
పట్నంలో బ్రతుకుతున్న కుర్రవాడి చిన్నతనం నుండి పదిహేనేళ్ళు వచ్హేవరకూ తన పల్లెటూరి ప్రయాణాల చిన్ననాటి గుర్తులే - ప్రళయ కావేరి కథలు. రమేష్ గారు తన మొదటి రచనలోనే తనతో పాటే తన వూరు తీసుకొని వెళ్ళారు. ఫ్రకౄతి వర్ణన ఎంత బాగుంటాయంటే మీకు బాపు గారి బొమ్మలు అవసరం లేదు. మీకు మీరే ఎన్నో మనో చిత్రాలు వేసుకోగల వర్ణనలు ప్రతి కథలోను వుంటాయి. ప్రళయకావేరి - ఒక సజీవ జీవసౌందర్యావిష్కరణకు పుట్టినిల్లు అని తెలుస్తుంది. రమేష్ గారు ఎంతో పరిశోదనతో ప్రతి విషయాన్ని రాసారు. ఇవన్నీ చదివాక, మనందరం ఒక్క సారి మన బాల్యం వైపు చూసుకోవటం ఖాయం.
ప్రళయ కావేరి కథలు వెబ్లో మీరు తెలుగుపీపుల్.కాం చదవచ్హు.
నాకు నచ్హిన కథ - పద్దినాల సుట్టం
ప్రళయకావేరి కధల జాబితా
1.ఉత్తర పొద్దు
2.కాశెవ్వ బొగాతం
3.పాంచాలి పరాభవం
4.ఎచ్చలకారి సుబ్బతాత
5.కత్తిరిగాలి
6.మామిడి చెట్టు - కొరివి దెయ్యం
7.ఆడే వయెసులో ఆడాల
8.కొత్త సావాసగోడు
9.నల్లబావ తెంపు
10.పద్దినాల సుట్టం
11.తెప్పతిరణాళ
12.ప్రవాళా ప్రయాణం
13.పుబ్బ చినుకుల్లో
14.అమ్మపాల కమ్మదనం
15.అటకెక్కిన అలక
16.సందమామ ఇంట్లో సుట్టం
17.పరంటీది పెద్దోళ్ళు
18.మంట యెలుతుర్లో మంచు
19.దాపటెద్దు తోడు
20.ఆడపొడుసు సాంగెం
21.వళ్ళెరగని నిదర
పల్లెటూరి అందాలు - రచయితలందరూ మన తెలుగు పల్లెటూళ్ళ అందాలు చక్కగా వర్ణించారు. ఒకే తెలుగు బాషతో విబిన్న మాండలికాలతో చూపగలిగారు.
పల్లెటూరి స్థితిగతులు, పాత్రలు - మనకు పరిచయం అయిన ప్రతి పాత్ర మనము ఆ వూరు వెళితే కనపడతారేమో! కనపడితే బాగుంటుంది అనిపించే విదముగా చెప్పారు.
శంకరమచి గారి అమరావతి కధలు - తర తరాల కధలు చెపితే. వంశీగారు గారు తనతో పెరిగిన, చూసిన, విన్న మిత్రుల కధలు చెపితే. రమేష్ గారు తన కధే చెప్పారు.
కధలు జిల్లాలు మారినా ప్రతి మంచి పాత్ర తాను నమ్మిన తెలుగు సాంప్రదాయాలు,విలువలు,కట్టుబాట్లు,నమ్మకాలు మనకు గుర్తు చేస్తునట్లే అనిపిస్తుంది.
ఇంతవరకూ చదవక పొతే - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.
My search is over... Thanks for your help!! Where I can get this book ??(Except www.avkf.org/BookLink/brief_view_subjects.php?cat_id=3 )thanks
ReplyDeleteచాల మంచి రచయిత కథలు పరిచయం చేసారు నాకు చలాఆఆఆఆఆఆఆ చలాఆఆఆఆఆఆఆఅ ఇష్టం తన కలం నుండి జాలువారే ప్రతి కథ .మంచిపుస్తకలు పరిచయం చేసారు .
ReplyDeletenenu ee kathalanu andhrajyothi lo vachchetappudu chadivaanu.chaalaa baagundevi.meeru mallee veetini manoyavanika meedaku techchaarandee chalaa thanks .ee kathala pusthakam ekkada dorukuthundo theliyachesthaaraa?
ReplyDeleteతెలుగువారు ప్రతివాళ్ళు తప్పక చదవాల్సిన కథలివి.
ReplyDeleteప్రాంతీయ కథనాల్లో ఈ పుస్తకం ఒక గొప్ప విజయం - ఎందుకంటే రచయిత రమేష్ ప్రవాసాంధ్రుడు!
ReplyDeleteతప్పక చదవాల్సిన కథలు