Monday, August 11, 2014

భారతదేశంలో శాసనాలు/చట్టాలు శత్రువులకేనా ?

"చట్టం దానిపని అది చేసుకుంటుంది." -- అంటే ఆ మనిషి గాని సంస్థ గాని ఈ మనిషికి గాని సంస్థ/పార్టీ గాని శత్రువు. దీనిని మన కేంద్ర ప్రభుత్వం నుండి సినిమా టిక్కట్లు ఇచ్చే మనిషి వరకూ వాడే డాలు అన్నమాట.

Monday, November 1, 2010

ఎందుకనుకుంటారు?

ఎందుకనుకుంటారు?

1. నా ఇంటిముందు చెత్త ఊడ్చి పక్క ఇంటి ముందు తోసే నేను, రోడ్డు శుబ్రం గురుంచి అలోచిస్తానని ఎందుకనుకుంటారు?
2. నన్ను ఎవరూ ఉద్యోగంలో నుండి పీకలేరని తెలిసినాక నేను పని చేస్తానని, గడ్డి కరవనని ఎందుకనుకుంటారు?
3. నా ప్రాంతం లోకి (బాష ఒక్కటైనా,దేశమొక్కటైన,పక్క రాష్త్రమొక్కటైనా)ఎవ్వరినీ రానివ్వని నేను వేరే దేశంలో ఉద్యోగాలకి మనలను ఎందుకు తీసుకోరు అని అడగనని ఎందుకనుకుంటారు?
4. దొరికినంత దొంగ గడ్డి తినడమే గొప్ప ఆదర్సంగా వున్న ఈ సంఘం లో నేను ఈ సంఘంలో ఉత్తమ పౌరుడు కావటానికి ప్రయత్నం చేయనని ఎందుకనుకుంటారు?
5. అధికారం నా చేతిలో వున్నపుడు ఆదర్స్యం (ఎగిరెగిరి దంచినా అంతే,ఎగర కుండా దంచినా అంతే అని తెలిసినప్పుడు) గా వుంటే ఎమీ జరగదని తెలిసీ ఆదర్స్యంగా వుంటానని ఎందుకనుకుంటారు?

రాజకీయ ప్రశ్నలు


రాజకీయ ప్రశ్నలు

మీకు తెలిస్తే చెప్పండి ...

1. నీవు ఎన్నుకోని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మీద నీకు వున్న అధికారాలు ఏమిటి?
2. ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి ఎవరికి జవాబు చెప్పాలి? తనని ఎన్నుకున్న పార్టీకా, లేక పార్టీలకా? ఇందులో సామాన్యుని పాత్ర ఎంత?
3. మనము ఎన్నుకోని ముఖ్యమంత్రి/ప్రదానమంత్రి మనకు జవాబు దారిగా ఎందుకు వుండాలో నాకు తెలియదు. మీకు తెలుసా?
4. మెజారిటి అంటే, 40 % ఓటింగు (దొంగ ఓట్లతో కలిపి) జరిగితే అందులో 10% వచ్హిన వాడు గెల్చి మిగిలిన తనకు వోటు వేయని 90 % ఎంత వరకు సహాయం/ప్రజా సేవ చేస్తాడని నమ్మాలి?
5. పది కోట్లు ఖర్చు పెట్టి (మీ మెజారిటి వొట్లు డబ్బు/లంచం ఇచ్హి కొనుక్కొని ) ప్రజాసేవ చెయడానికి వచ్హిన నేను, మీకు సహాయం/ప్రజా సేవ చేస్తానని ఎందుకు అనుకుంటారు?

అమరావతి కథలు , దర్గా మిట్ట కథలు, మిట్టూరోడి కథలు గురుంచి చదవాలంటే

అమరావతి కథలు , దర్గా మిట్ట కథలు, మిట్టూరోడి కథలు గురుంచి చదవాలంటే ఇక్కడ చదవచ్హు -
http://telugu.greatandhra.com/mbs/sep/amara_part1.php
http://telugu.greatandhra.com/mbs/sep/mittu_part1.php
http://telugu.greatandhra.com/mbs/oct2010/darga_part1.php

Wednesday, April 28, 2010

గోదావరి కథలు




"ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగి పోతుంటాయి.తరంగానికి దిగువ మనకు కనపడని మరొక తరంగం వుంటుంది. ఆ తరంగశక్తే మనము చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది.అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో కథలు దాగి వుంటాయి. ఆ సాగే కథలకు పారే గోదావరి సాక్షి."


చరిత్ర చదివిన/విన్న మనందిరికి తెలిసిన సత్యం - మానవ నాగరికతకు, నీటికి చాలా దగ్గరి సంబందం వుందని. పెద్ద పెద్ద నగరాలు నీటి పక్కనే వెలిశాయని, మనిషి తన మనుగడకు ముఖ్యమైన నీటిని,భూమిని ప్రేమించడం, వాటిని పుజించడము,వాటికోసం యుద్దాలు చేయడాలు, ప్రస్తుతం చేసుకోవడాలు కూడ తెలిసినదే.

తెలుగువారు నివసించిన/నివసిస్తున్న ప్రాంతల మీద ప్రతి రచయితా ఎంతో పట్టుతో రాసిన కథలే ఈ పుస్తకాలు. ప్రదానంగా నేను చదివిన ఈ పుస్తకాలని రెండు భాగాలుగ అనుకుంటే, అవి

భూమి కథలు - తెలుగు ప్రాంతాల గురుంచి కధలు - అమరావతి,మా పసల పూడి కథలు,అగ్రహారం కథలు,తెలంగాణ కథలు,దర్గా మిట్ట కథలు,వేట కధలు,పచ్చ నాకు సాక్షిగా ... సినబ్బ కతలు,మిట్టూరోడి కతలు,అమెరికా భేతాళ కథలు
నీటి కథలు - నీరు,లంకలు, వాటి మీద అదారపడి పాత్రల కథలే - ప్రళయ కావేరి, గోదావరి కథలు,మా దిగువ గోదావరి కథలు.

బి.వి.స్.రామారావు గారు రాసిన నీటి కథలే గోదావరి కథలు .
బాపు గారి బొమ్మలతో ఎంతో బాగున్నయి గోదావరి కథలు.


గోదావరి కథలు జాబిత

1. రాగి డబ్బు
2. ఎసరు - అత్తిసరు
3. తిప్పలు
4. అది -వాడు - చేప
5. బైరాగి
6.అద్దరి - ఇద్దరి
7. ఇదం బ్రాహ్మం
8. త్రిలోక సుందరి
9. గుండెల్లో గోదావరి
10. ఆఫీసులో ఆవకాయ గోంతులో వెలక్కాయ
11. పుష్కరాల రెవులో పుల్లట్ట్లు

ఇవి వెబ్లో ఫ్రీగా చదవచ్హు - http://www.archive.org/stream/godavarikathalu019901mbp
పురాణం సుబ్రమ్మణ్య శర్మ గారి అద్భుతమైన వాఖ్యానంతో మొదలైన పుస్తకం.

నాకు నచ్హిన కథ - గుండెల్లో గోదావరి

ఇంతవరకూ చదవక పొతే - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.

Tuesday, April 27, 2010

ప్రళయకావేరి కథలు


పట్నంలో బ్రతుకుతున్న కుర్రవాడి చిన్నతనం నుండి పదిహేనేళ్ళు వచ్హేవరకూ తన పల్లెటూరి ప్రయాణాల చిన్ననాటి గుర్తులే - ప్రళయ కావేరి కథలు. రమేష్ గారు తన మొదటి రచనలోనే తనతో పాటే తన వూరు తీసుకొని వెళ్ళారు. ఫ్రకౄతి వర్ణన ఎంత బాగుంటాయంటే మీకు బాపు గారి బొమ్మలు అవసరం లేదు. మీకు మీరే ఎన్నో మనో చిత్రాలు వేసుకోగల వర్ణనలు ప్రతి కథలోను వుంటాయి. ప్రళయకావేరి - ఒక సజీవ జీవసౌందర్యావిష్కరణకు పుట్టినిల్లు అని తెలుస్తుంది. రమేష్ గారు ఎంతో పరిశోదనతో ప్రతి విషయాన్ని రాసారు. ఇవన్నీ చదివాక, మనందరం ఒక్క సారి మన బాల్యం వైపు చూసుకోవటం ఖాయం.

ప్రళయ కావేరి కథలు వెబ్లో మీరు తెలుగుపీపుల్.కాం చదవచ్హు.

నాకు నచ్హిన కథ - పద్దినాల సుట్టం

ప్రళయకావేరి కధల జాబితా

1.ఉత్తర పొద్దు
2.కాశెవ్వ బొగాతం
3.పాంచాలి పరాభవం
4.ఎచ్చలకారి సుబ్బతాత
5.కత్తిరిగాలి
6.మామిడి చెట్టు - కొరివి దెయ్యం
7.ఆడే వయెసులో ఆడాల
8.కొత్త సావాసగోడు
9.నల్లబావ తెంపు
10.పద్దినాల సుట్టం
11.తెప్పతిరణాళ
12.ప్రవాళా ప్రయాణం
13.పుబ్బ చినుకుల్లో
14.అమ్మపాల కమ్మదనం
15.అటకెక్కిన అలక
16.సందమామ ఇంట్లో సుట్టం
17.పరంటీది పెద్దోళ్ళు
18.మంట యెలుతుర్లో మంచు
19.దాపటెద్దు తోడు
20.ఆడపొడుసు సాంగెం
21.వళ్ళెరగని నిదర

పల్లెటూరి అందాలు - రచయితలందరూ మన తెలుగు పల్లెటూళ్ళ అందాలు చక్కగా వర్ణించారు. ఒకే తెలుగు బాషతో విబిన్న మాండలికాలతో చూపగలిగారు.
పల్లెటూరి స్థితిగతులు, పాత్రలు - మనకు పరిచయం అయిన ప్రతి పాత్ర మనము ఆ వూరు వెళితే కనపడతారేమో! కనపడితే బాగుంటుంది అనిపించే విదముగా చెప్పారు.
శంకరమచి గారి అమరావతి కధలు - తర తరాల కధలు చెపితే. వంశీగారు గారు తనతో పెరిగిన, చూసిన, విన్న మిత్రుల కధలు చెపితే. రమేష్ గారు తన కధే చెప్పారు.
కధలు జిల్లాలు మారినా ప్రతి మంచి పాత్ర తాను నమ్మిన తెలుగు సాంప్రదాయాలు,విలువలు,కట్టుబాట్లు,నమ్మకాలు మనకు గుర్తు చేస్తునట్లే అనిపిస్తుంది.


ఇంతవరకూ చదవక పొతే - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.

Monday, April 26, 2010

మా పసలపూడి కథలు



తెలుగు సినిమాలు చూసే వారికి వంశీగారిని పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆయన సినిమాల వలే అయన కథలు కూడా పాఠకులకు ద్రుశ్యకావ్యాలు.

వంశీగారు గోదావరిని,పసలపూడిని ఎంత ప్రేమించారో ఈ పుస్తకంలో ప్రతి అక్షరం చెపుతుంది. ఆర్థం కాని వారికి బాపు గారి రంగుల బొమ్మలు కనువిందు చేసి చెబుతాయి.
నన్ను అడిగితే ఏ తెలుగు కథ అయినా ఎంత మంచిదో,ఎంతగా పాఠకుల మనస్సుకి దగ్గరగా వుంటుందో తెల్యాలంటే బాపు గారికి వొకసారి చదివి బొమ్మ వేయమంటే చాలు. కధ మంచిదయితే బొమ్మతో అందం పెరుగుతుంది. కథ సరిగా లేకపొతే బొమ్మే చెపుతుంది రచయిత ఇలా చెపుదామని అనుకొని చెప్పలేకపోయాడు అని. వంశీగారు ప్రతి కథలోను బాపుగారి బొమ్మలతో కథ అందం పెంచారు.

అమరావతి కథలు తర తరాల కథలతో మనని ఎన్నో పాత్రల దగ్గరికి తీసుకొని వెళితే - వంశీగారు ప్రతి కథలోను తన చుట్టూ వున్న వారి లేక కొంచెం మన ముందు తరం వారి గురించి చెప్పారు.

అమరావతి కథా రచయిత తన గురించి చివరి కథలో చెపితే, వంశీగారు ప్రతి కథలోను ప్రతి పదం లోను గోదావరి ప్రజల అలవాట్లు,ప్రేమలు, స్నేహాలు, అమాయకత్వం కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగారు.

ఈ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది. వెబ్లో కొనాలంటే/ కావాలంటే
- avkf.org/BookLink/display_titled_book.php?book_id=9423PHPSESSID=8be33dae93c1e8b498af4d62866b35fb

ఇంతవరకూ చదవక పొతే, తప్పక కొనండి - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.

Sunday, April 25, 2010

అమరావతి కథలు - ఆంధ్రసాహిత్య అకాడమీ గ్రహీత.


చందమామ కథలలో వున్న శ్రుష్టత,సరళత,ప్రతి కధలో ప్రతి అక్షరానికి ఎంత విలువ వుంటాయో ప్రతి అమరావతి కథలలోను ప్రతి కథకు ప్రతి అక్షరానికి వున్నాయి. ఈ బంగారన్ని అందరూ బంగారంగా గుర్తించాక నేను కొత్తగా దీన్ని బంగారంగా పరిచయం చేయడం హస్యాస్పదం. ఈ బంగారానికి తావి అబ్భిన జంట బాపు,రమణలు. రమణగారి అంతటి మహనుభావుడు ముందు మాటకే కొన్ని పేజీలు రాసిన బంగారం ఇది.

చాలమంది పుస్తకాలు చదవని వారికి టీవి సిరియల్ గా కూడ పరిచయం. ఇంగ్లీష్లో "మాల్గుడి డేస్"కు వున్నంత అభిమానులను తెలుగులో సంపాదించుకున్న పుస్తకం. ఈ పుస్తకం రాసిన శంకరమంచి గారికి తెలుగుజాతి ఎంతో ౠణపడి వుందని నేను అనుకుంటున్నాను.

నేను ఈ పుస్తకాన్ని వేల సార్లు చదివాను. చాలా మందితో చదివించాను. ఇందిలో ప్రతి కథ గుర్తుండి పోయెవే,వెంటాడేవే.

నాతో వుండి పోయే కథ - "ఒక రోజెళ్ళిపొయింది". దానిలో పాత్ర పిచ్చయ్యగారు.

వెబ్లో కధల గురించి(కధలు కాదు) చదవాలంటే - శివరామప్రసాదు కప్పగంతు గారి (saahitya-abhimaani.blogspot.com/search/label/అమరావతి కథలు) ప్రతి కధ పరిచయం చదవండి. శివరామప్రసాదు కప్పగంతు గారికి ధన్యవాదములు.

ఇంతవరకూ చదవక పొతే, తప్పక కొనండి - చదవండి. చదివితే ఇంకొకరితో చదివించండి.

అమరావతి కథల జాబితా

1.వరద
2.సుడిగుండంలొ ముక్కుపుడక
3.పుణుకుల బుట్టలో లచ్చితల్లి
4.రెండుగంగలు
5.బంగారు దొంగ
6.ముక్కోటి కైలాసం
7.అరేసిన చీర
8.శివుడు నవ్వాడు
9.ఒక రోజెళ్ళి పోయింది
10.హరహర మహాదేవ
11.ధావళీ చిరిగిపోయింది
12.రాగిచెంబులో చేపపిల్ల
13.అద్గద్గో బస్సు
14.పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి
15.పందిరిపట్టి మంచం
16.అన్నపూర్ణ కావిడి
17.చెట్టు కొమ్మనున్న కథ
18.అఖరి వేంకటాద్రినాయుడు
19.ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే
20.పచ్చగడ్డి భగ్గుమంది
21.లేగదూడ చదువు
22.ఆవతలొడ్డు పొంగింది
23.మే!మే! మేకపిల్ల
24.కాకితో కబురు
25.తులసి తాంబూలం
26.భోజన చక్రవర్తి
27.నావెళ్ళిపోయింది
28.నీరు నిలవదు
29.ఎంగిలా?
30.బాకీ సంతతి
31.మాయ
32.నివేదన
33.ధర్మపాలుడు
34.నాన్న-నది
35.కీలుగుర్రం
36.అచ్చోసిన ఆంబోతులు
37.వయసొచ్చింది
38.లంకల్లపుట్టింది లచ్చితల్లి
39.ఇద్దరు మిత్రులు
40.పున్నాగ వాన
41.ఖాళీ కుర్చీ
42.రాజహంస రెక్కలు విప్పింది
43.ఎవరా పోయేది?
44.ముద్దులల్లుడు
45.ముద్దేలనయ్య - మనసు నీదైయుండ
46.వంశాంకురం
47.బలి
48.అటునుంచి కొట్టుకురండి
49.మనసు నిండుకుంది
50.అబద్ధం - చెడిన ఆడది
51.దొంగలో? దొరలో?
52.కానుక
53.తల్లి కడుపు చల్లగా
54.విరిగిన పల్లకి
55.నావెనుక ఎవరో....
56.సిరి - శాంతి
57.గుండె శివుడి కిచ్చుకో
58.సంగమం
59.అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి
60.మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ
61.అంపకం
62.నిండుకుండ బొమ్మ
63.గాయత్రి
64.మౌన శంఖం
65.అదుగో - అల్లదుగో...
66.అప్పడాల అసెంబ్లీ
67.మాట్టి..ఒఠిమట్టి..
68.వేలం సరుకు
69.నిలబడగలవా?
70.సాక్షాత్కారం
71.ఎవరికీ చెప్పమాక!
72.జ్ఞానక్షేత్రం
73.ఏక కథాపితామహ
74.తృప్తి
75.ఆగని ఉయ్యాల
76.తెల్లవారింది
77.తంపులమరి సోమలింగం
78.ఏడాదికో రోజు పులి
79.దూరంగా సారంగధర
80.అమావాస్య వెలిగింది
81.త, థి, తో, న
82.స్తంభన
83.పట్టుత్తరీయం
84.మృత్యోర్మా...
85.అంతా బాగానే ఉంది
86.దీపం - జ్యోతి
87.కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి
88.పూల సుల్తాన్
89.పక్క వీది జన్మంత దూరం
90.టపా రాలేదు బొట్టు చెరగలేదు
91.భొజనాంతే...
92.ఓ నరుడా! వానరుడా!
93.బిందురేఖ
94.నేనూ మేల్కొనే వున్నాను
95.ఏడుపెరగనివాడు
96.అరుగరుగో సుబ్బయ్య మేష్టారు
97.ప్రణవమూర్తి
98.సీతారామాభ్యాం నమ:
99.శిఖరం
100.మహా రుద్రాభిషేకం

తెలుగు ప్రాంతీయ కథల పుస్తకాలు


తెలుగు ప్రాంతీయ కథల పుస్తకాలు ఎన్నో చదివిన తరువాత ఒక చోట అన్నీటి గురించి వొక సంగ్రహంగా రాస్తే తెలిసిన వారు ఇంకోన్ని పుస్తకాలు పరిచయము చేస్తారనే ఆశతో - నేను చదివిన/చదువుతున్న కథలు.

మన తెలుగు ప్రాంతాలని ఎవరికయినా(మనలో మనకి కూడా) పరిచయం చేయాలంటే ఆ ప్రాంతాపు ప్రజల కష్తాలు, అనందాలు, అలవాట్లు చక్కగా కథల రూపంలో చెప్పగలిగితే చాలు. ఈ పుస్తకాలు చాల వరకు విజయం సాదించాయని చెప్పడానికి వీటికి వున్న అభిమానులే నిదర్శనం.

ఇవి ప్రతి రచయిత వారు పెరిగిన,జీవించిన,ప్రేమించిన ఫ్రాంతము మీద ప్రేమగా రాసిన తెలుగు పుస్తకాలు. వీటి సమీక్షలు వెబ్లో చాలా చోట్ల దొరుకుతాయి.

1. ఆమరావతి కథలు - శంకరమంచి సత్యం గారు రాసినవి.పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది.
2. మా పసలపూడి కథలు - పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది. వంశీగారు రాసింది.
3. ప్రళయకావేరి కథలు - స. వెం. రమేష్ గారు - ఆంధ్రజ్యోతి లో రాసిన కధలు - వెబ్లో చదవాలటే (telugupeople.com/content/Content.asp?ContentID=22714catID=32) లో దొరుకుతాయి.
4. గోదావరి కథలు - బి.వి.ఎస్. రామారావు. మురళి గారికి ధన్యవాదములు - http://www.archive.org/stream/godavarikathalu019901mbp#page/n3/mode/2up
5. అగ్రహారం కథలు - కౌముది (కౌముది.నెట్) లో వస్తున్నది. వేదుల సుభద్రగారు రాస్తున్నారు.
6. దర్గా మిట్ట కథలు - ఖాదీర్ బాబుగారు రాశారు.
7. తెలంగాణ కథలు - కాలువ మల్లయ్య గారు రాసిన కధలు. పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది. వెబ్లో పుస్తకం గురించి చదవాలంటే (avkf.org/BookLink/book_of_week/2364_book_detail.pdf) చదవండి.
8. మా దిగువ గోదావరి కథలు - వంశీగారు రాస్తున్నారు. స్వాతిలో సీరియల్ గా వస్తున్నది.
9. పోలేరమ్మబండ కథలు - ఖాదీర్ బాబుగారు రాశారు. శంకరయ్యగారికి ధన్యవాదములు గుర్తించినందుకు.
10. వేట కధలు - పతంజలి గారు రాసినవి.
11. పచ్చ నాకు సాక్షిగా ... సినబ్బ కతలు,మిట్టూరోడి కతలు - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసినవి.
12. అమెరికా భేతాళ కథలు - సత్యం మందపాటి గారు రాసిన కధలు.


ప్రతి పుస్తకం లేక పుస్తకాల గురించి మళ్ళీ రాస్తాను. ఇవి కాక ఇంకా వున్నాయని తెలుసు. మీకు తెలుస్తే రాయండి.

Friday, April 23, 2010

విశేషం

భిన్నత్వం లో ఏకత్వం, ఏకత్వం లో భిన్నత్వం - బిందువు లే రేఖలు,రేఖలతో బిందువు.
చుక్కలే సముద్రం, సముద్రం లో చుక్కలు - నిమిషాల తో జీవితం, జీవితమంటే నిమిషమే.
సమిష్టిగా తన కుటుంబం తోనే బ్రతక లేని ఓ మనిషీ వసుథెక కుటుంబం లా ప్రపంచం వుండాలని అనుకోవడం విశేషం.