Sunday, April 25, 2010

తెలుగు ప్రాంతీయ కథల పుస్తకాలు


తెలుగు ప్రాంతీయ కథల పుస్తకాలు ఎన్నో చదివిన తరువాత ఒక చోట అన్నీటి గురించి వొక సంగ్రహంగా రాస్తే తెలిసిన వారు ఇంకోన్ని పుస్తకాలు పరిచయము చేస్తారనే ఆశతో - నేను చదివిన/చదువుతున్న కథలు.

మన తెలుగు ప్రాంతాలని ఎవరికయినా(మనలో మనకి కూడా) పరిచయం చేయాలంటే ఆ ప్రాంతాపు ప్రజల కష్తాలు, అనందాలు, అలవాట్లు చక్కగా కథల రూపంలో చెప్పగలిగితే చాలు. ఈ పుస్తకాలు చాల వరకు విజయం సాదించాయని చెప్పడానికి వీటికి వున్న అభిమానులే నిదర్శనం.

ఇవి ప్రతి రచయిత వారు పెరిగిన,జీవించిన,ప్రేమించిన ఫ్రాంతము మీద ప్రేమగా రాసిన తెలుగు పుస్తకాలు. వీటి సమీక్షలు వెబ్లో చాలా చోట్ల దొరుకుతాయి.

1. ఆమరావతి కథలు - శంకరమంచి సత్యం గారు రాసినవి.పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది.
2. మా పసలపూడి కథలు - పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది. వంశీగారు రాసింది.
3. ప్రళయకావేరి కథలు - స. వెం. రమేష్ గారు - ఆంధ్రజ్యోతి లో రాసిన కధలు - వెబ్లో చదవాలటే (telugupeople.com/content/Content.asp?ContentID=22714catID=32) లో దొరుకుతాయి.
4. గోదావరి కథలు - బి.వి.ఎస్. రామారావు. మురళి గారికి ధన్యవాదములు - http://www.archive.org/stream/godavarikathalu019901mbp#page/n3/mode/2up
5. అగ్రహారం కథలు - కౌముది (కౌముది.నెట్) లో వస్తున్నది. వేదుల సుభద్రగారు రాస్తున్నారు.
6. దర్గా మిట్ట కథలు - ఖాదీర్ బాబుగారు రాశారు.
7. తెలంగాణ కథలు - కాలువ మల్లయ్య గారు రాసిన కధలు. పుస్తకం మర్కెట్లో దొరుకుతుంది. వెబ్లో పుస్తకం గురించి చదవాలంటే (avkf.org/BookLink/book_of_week/2364_book_detail.pdf) చదవండి.
8. మా దిగువ గోదావరి కథలు - వంశీగారు రాస్తున్నారు. స్వాతిలో సీరియల్ గా వస్తున్నది.
9. పోలేరమ్మబండ కథలు - ఖాదీర్ బాబుగారు రాశారు. శంకరయ్యగారికి ధన్యవాదములు గుర్తించినందుకు.
10. వేట కధలు - పతంజలి గారు రాసినవి.
11. పచ్చ నాకు సాక్షిగా ... సినబ్బ కతలు,మిట్టూరోడి కతలు - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసినవి.
12. అమెరికా భేతాళ కథలు - సత్యం మందపాటి గారు రాసిన కధలు.


ప్రతి పుస్తకం లేక పుస్తకాల గురించి మళ్ళీ రాస్తాను. ఇవి కాక ఇంకా వున్నాయని తెలుసు. మీకు తెలుస్తే రాయండి.

5 comments:

  1. మంచి ప్రయత్నమే మొదలుపెట్టారు.అభినందనలు.
    అబౌట్ మీ లో ఎందుకండీ అన్ని రోగలక్షణాలు??జబ్బు,వాంతులు,కక్కడం ???

    ReplyDelete
  2. దన్యవాదాలు రాజేంద్ర గారు. చెప్పాను కదండి. దొరికిన ప్రతిది చదివి Input ఎక్కువయి అండి, రోగ లక్షణాలు పెరిగి ఇలా.

    ReplyDelete
  3. నాగేస్రావ్April 25, 2010 at 5:47 PM

    గోదావరి కథలు, ఆచివరిదీ ఒకటి కాదు కదా?
    మొన్నేదో బ్లాగులో దరగామిట్ట గురించి చదూతూ సరిగ్ఘా ఇదే పట్టీని కాగితం మీద రాసి జేబులో పెట్టుకున్నా, బయటికెళ్ళినపుడు వీటికోసం వెదకాలని. చాలా సంతోషం మీరొక బ్లాగువరసే కేటాయించారు వీటికి.
    టాంక్సు.

    ReplyDelete
  4. ఖదీర్ బాబు గారిదే 'పోలేరమ్మబండ కథలు ' చాలా మంచి పుస్తకం.

    ReplyDelete
  5. మధురాంతకం రాజారాం గారి కథలు రాయలసీమ గ్రామీణ జీవితంలో మరో పార్శ్వాన్ని మన ముందు ఉంచుతాయి. రావిశాస్త్రి, చాసో, కారా మేష్టారి కథల్లో ఉత్తరాంధ్ర జీవితంకనిపిస్తుంది.. బి.వి.ఎస్. రామారావు రాసిన 'గోదావరి కథలు' కూడా గోదావరి తీర ప్రాంత జీవితాలని చిత్రించినవే, బాపు బొమ్మలతో...

    ReplyDelete