Monday, April 19, 2010

నాకు తెలిసిన సంక్రాంతి


చిన్నతనపు సంక్రాంతి -
అమ్మమ్మ వూరు వెళదాం, అమ్మ,పెద్దమ్మలు కలసి బూరెలు అరిసెలు చేయడం.
నాన్న, పెదనాన్నలు, మామయ్యలు పేకాటలు
చిన్నక్క, ఆడపిల్లలు అందరూ ముగ్గులు ,గొబ్బిమ్మలు పెట్టడం
కోడి పందాలు, బొంగరాలు అని డబ్బులు కోసం పిల్లల మందరం పెద్దాళ్ళ వెనక పడతం

సందడే సందడి

మధ్య తరపు సంక్రాంతి -
సందులో ముగ్గుల పోటీలు ,
ఇద్దరమూ మగ పిల్లలున్న మా ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళే అమ్మని పెద్ద ముగ్గులు పెట్టమని వెంటపడటం ,
చీకటిలో ఎవరూ లేకపొతే అమ్మకు తోడుగా ముగ్గులకు సహాయం చెయ్యడం,
వూరు నుడి వచ్చిన బూరెలు, అరిసెలు మూడు రోజులు వొకరికి తెలేయకుండా వొకరు ఖాళి చేయడం,
బోగి రోజున పక్క సందులో వారి కంటే పెద్ద మంట వేయాలని, టైర్ల దుకాణాలు తిరగడం ,

అల్లరి అల్లరి

కుర్ర కారు సంక్రాంతి -
సంక్రాంతి శలవలో కూడా ప్రైవేటులు వుండడం,
సంక్రాంతి సినిమాల విడుదల కోసం చర్చలు,
అన్ని మనకే తెలుసనే కోతలు ,
కోడి పందాలకు, సిన్మాలకు పరుగులు

పరుగులో పరుగులు

ప్రవాస సంక్రాంతి -
వూరు కాని వూరు , చదువులకి పరుగులు ,
సంక్రాంతి వస్తుందని తెలుసు జనవరి నేలని బట్టి,
కాని చుట్టూ పక్కల ఎవరికీ తెలవని సంక్రాంతి ,
తెలిసిన కొందరం వొకచోట చేరడం , చిన్నతనపు గుర్తులు నెమరు వేసుకోవడం

ఇంటి మీద గుబులో గుబులు

మా ఇంటి ప్రవాస సంక్రాంతి -
బార్య రావడం, ఇద్దరం ఎవరి సంక్రాంతి గురించి వారు చెప్పుకోవడం
పిల్లలు రావడం, వారికీ మా సంక్రాంతి చరిత్రలు చెప్పడం
టీవి లో వస్తూన్న సంక్రాంతి సంబరాలు నిజమయినవి కావని చెప్పడం
సంక్రాంతి గురించి తెలిసిన తెలుగు వారితో వారము చివరలో ఒక ఇంట్లో కలుసుకొని సంక్రాంతి చరిత్రల గురించి నెమరు వేయడం సంక్రాంతి మీద.

No comments:

Post a Comment